Nadeendla Manohar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో కొనుగోలు చేయలేదని మంత్రి వెల్లడించారు.మార్చి 22 ఉదయానికి రూ. 8,003 కోట్ల విలువైన 34.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిందని వివరించారు.శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ధాన్యం విక్రయించే ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవస్థను తీర్చిదిద్దామని అన్నారు.ఈసారి తూకం, తేమ శాతం తదితర అంశాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి న్యాయంగా రైతులకు మద్దతు ధర కల్పించామన్నారు.

ఇది కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు ప్రతీక అని అభివర్ణించారు.తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తీరును గుర్తుచేశారు.గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆరోపించారు.ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలనేది వైసీపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందని, రైతులకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేదిలేదన్నారు.తమ ధాన్యం అమ్మాలంటే మిల్లుల ఎదుట రాత్రింబవళ్లు క్యూ లైన్‌లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.మద్దతు ధర ఇవ్వకుండా తేమ శాతం పేరుతో మోసం చేశారని విమర్శించారు.”ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయం నెలకొనేది.
పండించిన పంటకు మద్దతు ధర రావాలంటే ప్రణాళికాబద్ధంగా వ్యవస్థ ఉండాలి.కానీ గత ప్రభుత్వం రైతులను అనేక అవాంతరాలకు గురిచేసింది” అని మంత్రి అన్నారు.టమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశామే కాకుండా, 24 గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడం చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేయాలని వైసీపీ వర్గాలు ప్రయత్నించినా, ప్రభుత్వం వారిని తిప్పికొట్టిందని మంత్రి స్పష్టం చేశారు.వాస్తవాలను జనాలకు అర్థమయ్యాయి. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
రూ. 8,003 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
34.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరణ
24 గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు
తూకం, తేమ శాతం పేరుతో ఎటువంటి మోసాలకు తావులేకుండా పారదర్శక విధానం
గత ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల అన్యాయం, ఇప్పుడు పూర్తి న్యాయం .ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో కొత్త చరిత్ర లిఖించామని మంత్రి స్పష్టం చేశారు.రైతులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తమ పంటకు సముచిత న్యాయం జరిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.