NagaVamshi: మీ ఛానళ్లను బతికిస్తున్న నా సినిమాలు:నాగవంశీ

NagaVamshi: మీ ఛానళ్లను బతికిస్తున్న నా సినిమాలు:నాగవంశీ

తాజాగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తుండగా, రివ్యూలలో మాత్రం నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోందని నిర్మాత నాగవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.రివ్యూవర్లు మాత్రం కంటెంట్ లేదని తీర్పులిస్తున్నారు, అసలు ఎవరు నిజం చెబుతున్నారు? అంటూ ఆయన ప్రశ్నించారు.

Advertisements

నెగెటివ్ రివ్యూ

మార్చి 28న రిలీజైన సినిమా బాక్సీఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా నిర్మాత నాగవంశీ ప్రెస్​మీట్ నిర్వహించారు. ఇందులో కంటెంట్ ఉంది కాబట్టే సినిమాలో ఇంత మంచి విజయం దక్కించుకుందని అన్నారు. అలాగే రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు.’కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి ఆడుతోంది’ అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

సెకండాఫ్‌

ఎలా ఉన్నా చూడటానికి ఇది ‘బాహుబలి2’, ‘పుష్ప 2’, ‘కేజీఎఫ్ 2’ కాదు కదా సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘కోర్టు’ బాగుంది కాబట్టి చూశారు. పక్క సినిమా బాగోలేక దాన్ని చూడలేదు. అలాగే ‘మ్యాడ్ స్క్వేర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ‘స్వాతిరెడ్డి’ పాటపైనా కామెంట్లు చేశారు. కంటెంట్‌ లేదు. సెకండాఫ్‌ పండలేదని అంటున్నారు. నేను థియేటర్‌లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్‌లకు తెలియడం లేదా’అంటూ ఆయన ప్రశ్నించారు.

119635255

మ్యాడ్ స్క్వేర్

సీక్వెల్ కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ఆడుతోందనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. కంటెంట్ లేకున్నా చూడడానికి మ్యాడ్ స్క్వేర్ సినిమా ఏమీ ‘బాహుబలి’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ లాంటి పెద్ద సినిమా కాదని, ఈ సినిమాలో పెద్ద హీరోలు ఎవరూ లేరని గుర్తించాలన్నారు. రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగుంది కాబట్టే ‘మ్యాడ్ స్క్వేర్‌’ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. 

వెబ్‌సైట్స్‌

‘సినిమా రిలీజై రివ్యూలు వచ్చిన తర్వాత కూడా ప్రెస్‌మీట్‌ పెట్టాను. అప్పుడు రివ్యూలపై కామెంట్ చేయలేదు. కానీ, ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు నడుస్తున్నాయి. మేం యాడ్స్​ ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా ‘కంటెంట్‌ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ జడ్జిమెంట్ ఇవ్వకండి. సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే వెబ్​సైట్స్​ మూసుకొని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఫైర్ అయ్యారు.

Related Posts
ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు
ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా టాలీవుడ్ స్టార్ జూ. ఎన్టీఆర్ ఈ మధ్యే ‘దేవర’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన Read more

OTT Web Series: ఓటీటీలోకి ‘ఖౌఫ్’ వెబ్ సిరీస్ ఎప్పుడంటే?
OTT Web Series: ఓటీటీలోకి 'ఖౌఫ్' వెబ్ సిరీస్ ఎప్పుడంటే?

ఓటీటీలో భయానక సంచలనం: ‘ఖౌఫ్’ & ‘చోరీ 2’ కథలతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డార్క్ డ్రామాలు శుక్రవారం ఒకటే రోజు… ఓటీటీ ప్రపంచం భయానక జానర్లతో Read more

Villain Role : రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా?
rana jakkanna

టాలీవుడ్ హీరో మరియు విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాష, పాత్రల పరిమితులు లేకుండా, అతడికి నచ్చిన పాత్రలలో ఎక్కడైనా Read more

మహిళా దినోత్సవ సందర్బంగా శ్రీలీలకు బహుమతి: చిరంజీవి
మహిళా దినోత్సవ సందర్బంగా శ్రీలీలకు బహుమతి: చిరంజీవి

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే, ఈ రోజు సంబరాలు, ప్రేమ, అభినందనలతో మహిళలను గౌరవించడంలో విశేషమైన సందర్భం. 2025లో మహిళా దినోత్సవం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×