నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నిర్మాత ఎస్ కె ఎన్

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నిర్మాత ఎస్ కె ఎన్

తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని.ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయ్యిందని,ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎస్ కె ఎన్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. వైష్ణవిని ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండల సినిమాల్లో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యత: తప్పుడు ప్రచారంపై నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీనటిస్తోంది. తమ బ్యానర్ లో ఆమెకు ఎస్కేఎన్ మరో సినిమాను ఆఫర్ చేస్తే ఆమె అంగీకరించలేదట. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలను కొందరు నెటిజెన్లు తప్పుబడుతున్నారు. తెలుగు హీరోయిన్లు ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. తన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తుండడంతో నిర్మాత ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానళ్లలో తెలుగమ్మాయిలతో ఇకపై తాను వర్క్ చేయనని, తెలుగమ్మాయిలతో పని చేస్తే ఇబ్బందులు వస్తున్నాయని అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, స్పష్టంచేశారు.తాను ఎప్పటి నుంచో తెలుగు నటీమణులను, తెలుగు టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నానని. ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలను హీరోయిన్‌లుగా పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో నేను ఒకణ్ని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత, ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఇనాయాలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాం. నెక్ట్స్ హారిక, మరో కొత్త అమ్మాయిని కూడా పరిచయం చేయబోతున్నాం. అని వివరించారు.

Advertisements
SKN Vaishnavi Chaitanya 1739784954380 1739784961739

తెలుగు జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభం:

తాను తన కెరీర్‌ను తెలుగు జర్నలిస్టుగా ప్రారంభించానని, తెలుగు వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని కోరుకుంటాను. ఇప్పటి వరకు 25 మంది తెలుగమ్మాయిలకు హీరోయిన్లు, రైటర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు, దర్శకులుఇలా వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించాను. ఎవరికైనా మొదటి అవకాశం ఇవ్వడం ఎంతో ముఖ్యమైన విషయం. నేను ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ ఉంటానని తెలిపారు.

రాబోయే చిత్రాల్లోనూ తెలుగమ్మాయిలకే ప్రాధాన్యం:

నా రాబోయే 3 చిత్రాల్లో కూడా తెలుగమ్మాయిలే పనిచేస్తున్నారు. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగమ్మాయే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగమ్మాయే, రైటర్ కూడా తెలుగమ్మాయే. ఇంతమంది తెలుగమ్మాయిలను మేం ప్రోత్సహిస్తున్నాం. కానీ, కొంచెం సరదాగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని, తెలుగమ్మాయిలతో ఇక వర్క్ చేయొద్దు అని అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. 

Related Posts
Dia Mirza: రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మీర్జా ఆగ్రహం..ఎందుకంటే?
రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి ఘాటు స్పందన

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని కంచ గచ్చిబౌలి భూముల వేలం నేపథ్యంతో బాలీవుడ్ నటి దియా మిర్జా చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తెలంగాణ Read more

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడైనా కియారా కనిపిస్తుందా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠతో వేచి వేళ.ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read more

అప్పుడు ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది
sai pallavi 1 jpg 1200x630xt

నటనకు ప్రాధాన్యం ఉండే, మనసును హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి సాయిపల్లవి, తన కెరీర్లో నూతన దశను అధిగమించేందుకు 'రామాయణ' చిత్రంతో Read more

Babita Phogat: ‘దంగ‌ల్’ సినిమా రూ.2వేల కోట్లు కొల్ల‌గొడితే.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా
dangal 2

మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ ఆయన కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్‌ల జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘దంగల్’ ఈ చిత్రం భారీ Read more

×