हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Muskmelon:ఖర్బూజా తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Anusha
Muskmelon:ఖర్బూజా తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

వేసవిలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది.ఈ పరిస్థితిలో, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.వేసవికాలంలో దాహాన్ని తీర్చే పండ్లలో కర్బూజా (మస్క్ మిలన్) ఒకటి. ఇది పుచ్చకాయ మాదిరిగానే ఎక్కువ శాతం నీటిని కలిగి ఉండే రుచికరమైన పండు. తీపి రుచితో పాటు అనేక పోషకాలతో కూడిన ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మందికి కర్బూజా యొక్క ప్రయోజనాల గురించి పూర్తి అవగాహన లేదు. ఈ వేసవిలో కర్బూజా తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

కర్బూజాలో పొటాషియం అధికంగా ఉండటంతో, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచే సహజమైన మార్గాల్లో కర్బూజా ఒకటి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కర్బూజాలో అధికంగా ఉండే ఫైబర్ నీరు జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. మలబద్ధకాన్ని నివారించడంతో పాటు, ప్రేగుల కదలికలను మెరుగుపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, పొట్టలో చల్లదనం ఉండటానికి కర్బూజా సహాయపడుతుంది.

Muskmelon 2024 03 2a0b814999ae9f833742744882d20e56

హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది

వేసవి కాలంలో శరీరంలోని నీరు ఆవిరై పోవడం సహజం. అయితే, కర్బూజా తినడం వల్ల శరీరానికి తగినంత నీరు అందుతుంది. ఈ పండులో దాదాపు 90% నీరు ఉండటంతో, వేసవి కాలంలో ఇది అత్యంత ఉపయోగకరమైన పండుగా మారింది. వేడికాలంలో హైడ్రేషన్‌ను కాపాడుకోవడానికి పుచ్చకాయ, మామిడి, కివి, బెర్రీలు కూడా ఉపయోగకరమైనవి.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

కర్బూజా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ పండులో ఉండే విటమిన్ A మరియు కొల్లాజెన్ చర్మాన్ని మృదువుగా, తేజస్సుగా ఉంచుతాయి. తరచుగా కర్బూజా తినడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.

పోషకాలకు నిలయంగా ఉంటుంది

కర్బూజా తినడం వల్ల శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇందులో అధికంగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో, ఇది బరువు తగ్గే వారికి కూడా మంచి ఆహారంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కర్బూజాలో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

కంటికి మంచిది

కర్బూజాలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. కంటి చూపును పదును చేయడంలో మరియు వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870