అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్(Musk-Trump Fight)కి జరిగిన మాటల యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఈ వివాదం కారణంగా మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు (Tesla company shares) ఒక్కరోజులోనే 14 శాతం పడిపోయాయి. దీని వల్ల మస్క్‌కు దాదాపు $150 బిలియన్లు అంటే రూ.12.8 లక్షల కోట్లు మేర నష్టం వాటిల్లింది. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరుగా ఉన్నప్పటికీ ఈ ఒక్కరోజు నష్టం గణనీయమైనదిగా భావిస్తున్నారు.
మస్క్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణం
ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మస్క్ చేసిన వ్యాఖ్యలు భావిస్తున్నారు. ట్రంప్ ప్రస్తావించిన కొత్త ట్యాక్స్ బిల్లుపై మస్క్ తీవ్రంగా స్పందించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఇప్పటికే ఉన్న పన్ను మినహాయింపులను రద్దు చేయడం ద్వారా ఈ రంగాన్ని అణచివేయాలనే కుట్రగా మస్క్ పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, మస్క్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ బిల్లుతో ప్రజా ధనాన్ని వృథా చేసే రాయితీలు తగ్గించబడతాయని అన్నారు.
రాజకీయంగా మారిన వీరిద్దరి ఫైట్
ఈ వివాదం పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపింది. టెస్లా షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో మార్కెట్‌లో కంపెనీ విలువ భారీగా పడిపోయింది. మస్క్-Trump మధ్య నెలకొన్న ఈ ఘర్షణ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ప్రభుత్వ నిధుల వినియోగం ఒక పెద్ద చర్చగా మారుతుండటంతో, కార్పొరేట్ మరియు పాలిటికల్ వర్గాల్లో ఈ సంఘటనపై పెద్ద చర్చ జరుగుతోంది.
Read Also : India vs England : ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు కొత్త పేరు ఖరారు