ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘స్త్రీ-2’, ‘వెల్కమ్’ వంటి చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఆయనను దుండగులు గతనెల 20న కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం మీడియాలో సంచలనం రేపుతోంది. ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముస్తాక్ మీరట్ వెళ్లినప్పుడు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. ఆయన్ను గన్ తో బెదిరించి ఉత్తర ప్రదేశ్‌లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది.
ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ చేసిన వారు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి రూ.కోటి రూపాయిలు డిమాండ్ చేశారు. ఈ వార్త ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. తీవ్ర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా వ్యవహరించిన ముస్తాక్ ఖాన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని తప్పించుకున్నట్లు ఆయన స్నేహితుడు శివమ్ తెలిపారు. ఈ విషయమై ముస్తాక్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసు త్వరగా పసిగట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సినీ పరిశ్రమతో పాటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.