Murder: పెద్ద శంకరంపేట.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కమలాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్యకు (Murder) గురయ్యారు. గ్రామస్తులు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని కమలాపూర్ గ్రామానికి చెందిన తోట సుధాకర్, (45) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రించగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తోట సుధాకర్ పై దాడి (The main suspect) చేయడంతో తలకు బలమైన గాయం (Severe head injury) కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయమే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ (Medak DSP Prasanna Kumar) అల్లాదుర్గం సీఐ రేణుక పెద్ద శంకరంపేట. అల్లాదుర్గం ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి. శంకర్ స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జాగిలాలు. క్లూస్ టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Read also: Mangalagiri: ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం