ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు వెళ్తుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య హోరాహోరీ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కీలకమైన అంశం ఏమిటంటే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తుది జట్టులో ఉండటం అనుమానంగా మారింది. దీంతో మళ్లీ మహీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గైక్వాడ్ గాయం – టీమ్‌పై ప్రభావం
గతంలో రాజస్థాన్ రాయల్స్‌తో గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన కొన్ని ట్రైనింగ్ సెషన్లలోనూ అతడు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో చెన్నై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాట్లాడుతూ – గైక్వాడ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే అతడు ఈరోజు ట్రైనింగ్‌లో బ్యాట్ పట్టి నెట్స్‌లోకి దిగుతాడేమో చూడాలి, అని వెల్లడించారు. అయితే, గైక్వాడ్ పూర్తిగా ఫిట్ కాకపోతే ప్రత్యామ్నాయ కెప్టెన్ ఎవరు అన్న దానిపై కూడా హస్సీ స్పందించారు. ఇప్పటివరకు మేము కెప్టెన్సీ మార్పుపై ఆలోచించలేదు. అయితే అవసరం అయితే ధోనీ మళ్లీ జట్టును నడిపించే అవకాశం ఉంది అని చెప్పారు.
ధోనీ కెప్టెన్సీ
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకరు. 2008లో తొలిసారి టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచే సీఎస్‌కేకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ పది సార్లు జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లారు. ఐదు టైటిల్స్ CSK ఖాతాలో వేసారు. 266 మ్యాచ్‌లలో జట్టును నడిపించిన ధోనీ, 133 విజయాలు సాధించారు. కెప్టెన్‌గా అతడి శాంత స్వభావం, సాహసోపేతమైన నిర్ణయాలు, మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లే నైపుణ్యం అభిమానుల్ని ఆకట్టుకుంది. CSK అభిమానులు ప్రస్తుతం గైక్వాడ్ ఫిట్‌నెస్‌పై ఆశగా ఉన్నారు. అతడు ఈ సీజన్‌లో జట్టును సుస్థిరంగా నడిపిస్తున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గైక్వాడ్ ఆడకపోతే, జట్టుకు పాతికే తేడా స్పష్టంగా కనిపించొచ్చు. అయితే గాయపడ్డ అతడు కోలుకుని మైదానంలోకి వస్తే, ధోనీ అతడికి వెనుక నిలబడి మద్ధతు ఇస్తాడన్నది ఖాయం. ఢిల్లీ కేపిటల్స్‌తో గతంలో జరిగిన మ్యాచుల్లో చెన్నైకు ఉన్న విజయ శాతం అధికం. ముఖ్యంగా చెపాక్‌లో ధోనీ జట్టును ముందుండి నడిపిస్తే, గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయి. చెపాక్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటం కూడా సీఎస్‌కేకు అదనపు ప్లస్ పాయింట్ అవుతుంది.
Read also: Suryakumar Yadav: రిటైర్డ్ హర్ట్‌పై సూర్య షాకింగ్ రియాక్షన్