తాజాగా ఎమ్ఆర్ఐ స్కానింగ్ కారణంగా ఓ మహిళ మరణించడంతో, ఈ ప్రక్రియపై భయాలు పెరుగుతున్నాయి. నిజానికి ఎమ్ఆర్ఐ స్కానింగ్ అనేది వైద్య రంగంలో అత్యంత ఉపయోగకరమైన టెక్నాలజీ. కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా నిర్లక్ష్యం వల్ల, అది ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. అయితే, ఎమ్ఆర్ఐ స్కాన్ ఎంతవరకు సురక్షితం? ఎవరు ఎమ్ఆర్ఐ చేయించుకోవద్దు? స్కానింగ్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అన్న అంశాలను పరిశీలిద్దాం.

ఎమ్ఆర్ఐ స్కానింగ్ అంటే ఏమిటి?
ఎమ్ఆర్ఐ స్కానింగ్ అనేది బలమైన అయస్కాంత (Magnetic Field) మరియు రేడియో తరంగాలను ఉపయోగించి శరీరంలోని అంతర్గత అవయవాలను స్పష్టంగా చూపించే మెడికల్ ఇమేజింగ్ విధానం. దీని ద్వారా, మెదడు, మృదువైన కణజాలాలు, ఎముకలు, కీళ్ల సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధులను గుర్తించవచ్చు. అసలు విషయానికి వస్తే, సాధారణ పరిస్థితుల్లో ఎమ్ఆర్ఐ స్కానింగ్ పూర్తిగా సురక్షితమే. ఇది ఎక్స్-రే లేదా సిటి స్కాన్ లాంటివి కాకుండా రేడియేషన్ విడుదల చేయదు. అయితే, శరీరంలో ఏదైనా మెటల్ పరికరాలు ఉంటే, అవి అయస్కాంత ప్రభావంతో కదిలే ప్రమాదం ఉంది. కొన్ని మెటల్ పరికరాలు ఉన్నవారు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా, ఈ కింది పరికరాలు ఉన్నవారు స్కానింగ్ చేయించుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరికి ఎమ్ఆర్ఐ సురక్షితం కాదు?
కొన్ని మెటల్ పరికరాలు ఉన్నవారు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా, ఈ కింది పరికరాలు ఉన్నవారు స్కానింగ్ చేయించుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత పరికరాలు పేస్ మేకర్ , ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డెఫిబ్రిలేటర్ , ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్ మెదడు సంబంధిత మెటల్ పరికరాలు: బ్రెయిన్ అనేయురిజమ్ క్లిప్స్ ,మెటల్ , కాయిల్స్ లేదా స్టెంట్స్ , మెటల్ ప్లేట్లు లేదా స్క్రూలు .ఇతర మెటల్ పరికరాలు: చెవి ఇంప్లాంట్లు , మెటల్ దంత లేదా బ్రేసెస్, కీళ్ల ప్రత్యర్థులు, గర్భనిరోధక పరికరాలు ఈ మెటల్ పరికరాలు ఉన్నవారు ఎమ్ఆర్ఐ చేయించుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి. గర్భవతులు స్కానింగ్ చేయించుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ఎమ్ఆర్ఐ భయపెట్టొద్దు: చాలా మందికి ఎమ్ఆర్ఐ గది చిన్నగా ఉండటంతో భయం కలుగుతుంది. అలాంటి వారు ముందు డాక్టర్‌ను సంప్రదించి ఉపశమన మార్గాలు అన్వేషించాలి. ఇదే తరహాలోఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన ఓ మహిళ ఎమ్ఆర్ఐ స్కాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది .గతంలో గుండెపోటు రావటంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లు పేస్ మేకర్ అమర్చారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సూచన మేరకు స్కానింగ్ కోసం వెళ్లింది. ఆమెకు పేస్ మేకర్ అమర్చిన విషయం వైద్య సిబ్బంది గుర్తించకపోవడంతో, అది స్కానింగ్ మిషన్ వల్ల దెబ్బతింది. దీంతో ఆమె గుండె ఆగిపోయింది. ఎమ్ఆర్ఐ అనేది అత్యంత ఖచ్చితమైన వైద్య పరీక్ష. ఇది చాలా వ్యాధులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కానీ, ఇది చేయించుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శరీరంలో మెటల్ పరికరాలు ఉంటే, ఎమ్ఆర్ఐ చేయించుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.