हिन्दी | Epaper

అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప 2

Sudheer
అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు బుక్ కావడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న ఈ చిత్రం ఈ నెల 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ కోసం అభిమానులు , సినీ ప్రముఖులు ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు . బుక్ మై షో లో టికెట్స్ ఓపెన్ అయ్యాయో లేదో.. అభిమానులు , ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో సరికొత్త రికార్డు గా నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే బుకింగ్స్ మొదలైయి, చాలా చోట్ల టికెట్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇది నిర్మాతలకే కాకుండా థియేటర్లకు కూడా ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ఈ నిర్ణయం ప్రేక్షకులపై మరింత ఆసక్తిని కలిగిస్తూ బుకింగ్స్‌ను పెంచే అవకాశం కల్పించింది. ‘పుష్ప-2’ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ప్రధాన కారణం అల్లు అర్జున్ స్టైలిష్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం. ‘పుష్ప-1’ భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తేది దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా హైప్ మరింతగా పెరుగుతోంది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ‘పుష్ప-2’ విడుదలతో మరోసారి టాలీవుడ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఇదో సత్తా చూపే చిత్రం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870