“కేజీఎఫ్” ఫేమ్ యష్ నటిస్తున్న తాజా చిత్రం”టాక్సిక్”ఎంతగానో ఆసక్తిగ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో గ్రాండ్‌గా జరుగుతోంది మరియు ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. “కెవీఎన్ ప్రొడక్షన్స్” భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.యష్ “కేజీఎఫ్: చాప్టర్ 1” మరియు “కేజీఎఫ్: చాప్టర్ 2” వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు “టాక్సిక్” అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఒక కొత్త చిత్రంతో ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి యష్ సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమాలో యష్ నటనతో పాటు, నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్‌లు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ తారలు షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది, అక్కడ నయనతార కూడా సెట్‌లో జాయిన్ అయ్యారు.ఈ చిత్రం టీజర్ గతంలో యష్ పుట్టినరోజున విడుదల చేయగా యష్ యొక్క రగ్డ్ లుక్ అన్ని దృష్టులను ఆకర్షించింది. ఈ చిత్రం “కెవీఎన్ ప్రొడక్షన్స్” వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, అలాగే సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారు.
ఈ సినిమాకు ముంబైలో ఉన్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. “టాక్సిక్” సినిమా భరతదేశంతో పాటు విదేశాలలో కూడా భారీగా విడుదల చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు యష్ ప్రకటించారు. ఈ సినిమాను 20వ సెంచరీ ఫాక్స్ స్టూడియోతో కలిసి నిర్మించడానికి యష్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి అందుబాటులో వచ్చిన సమాచారం ప్రకారం “టాక్సిక్” సినిమా డిసెంబర్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన అనుభవాన్ని అందించబోతుందని భావిస్తున్నారు. “టాక్సిక్” సినిమా కోసం అభిమానులు ఇంకా మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.