టాలీవుడ్‌లో పాపులర్ జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ ప్రేమకథను అధికారికం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు వచ్చినా, ఈ జంట ప్రతిసారి హాస్యంగా తప్పించుకునే వారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ జంట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వేదికపై కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుక్రవారం నిశ్చితార్థం (Vijay Devarakonda & Rashmika Engaged) చేసుకున్నారని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని సన్నిహితులు తెలిపారు. ఈ వార్తతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Orders for Transfers : టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు ఉత్తర్వులు
రష్మిక మందన్న ‘చల్లో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ జంటగా నిలిచింది. ఈ హిట్ జంట మరోసారి ‘డియర్ కామ్రేడ్’లోనూ కలిసి నటించి ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తెరపై హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరూ, నిజజీవితంలోనూ జంటగా మారడం సినీ ప్రేమికులకు డబుల్ హ్యాపీగా మారింది.

విజయ్–రష్మిక రిలేషన్‌పై గతంలో వచ్చిన రూమర్స్‌పై ఈ జంట ఎప్పుడూ “మేము మంచి స్నేహితులం” అని సమాధానం ఇచ్చేవారు. కానీ కలిసి టూర్స్‌కి వెళ్లడం, పార్టీల్లో పాల్గొనడం వంటివి ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు నిశ్చితార్థ వార్తలు బయటకు రావడంతో అభిమానులకు ఇది నిజమైన సర్‌ప్రైజ్‌గా మారింది. త్వరలో జరగబోయే వివాహం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తుందని, అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారని తెలుస్తోంది.