हिन्दी | Epaper

Rowdy Janardhana : విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్!

Sudheer
Rowdy Janardhana : విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక భారీ కాంబినేషన్ సెట్స్పైకి రాబోతుంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ నమ్మకంతో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 11వ తేదీన మూవీ లాంచ్ జరిగే అవకాశం ఉంది. అనంతరం అక్టోబర్ 16న ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘ రాజావారు రాణిగారు ’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ఆయన ప్రత్యేకమైన నేరేషన్ స్టైల్, ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్‌కి పేరుగాంచారు.

Sammakka-Sarakka University : సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ

ఈ సినిమా (Rowdy Janardhana)లో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ దేవరకొండ–కీర్తి సురేశ్ కాంబినేషన్ ఇది మొదటిసారి కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్నందున ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ‘రౌడీ జనార్ధన’ కథ యాక్షన్, ఎమోషన్, డ్రామా కలయికగా ఉండనుందని, ఇది విజయ్ ఇమేజ్‌కు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో విజయ్ మరలా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు అభిమానులు విశ్వసిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ ఒక పెద్ద ప్రమాదం నుండి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. పుట్టపర్తి నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. అయితే, విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం అభిమానులకు ఊరట కలిగించింది. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో గాడ్ బ్లెస్ విజయ్ ”, “ స్టే సేఫ్ అన్నా” అంటూ అభిమానులు సందేశాలు వెల్లువెత్తించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870