Prabhas The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ అమెరికా బాక్సాఫీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే చర్చ మొదలైంది. సినిమా విడుదలకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగా, ఉత్తర అమెరికా మార్కెట్‌లో ప్రీ-సేల్స్ మందగించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బాహుబలి విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే రికార్డులు బద్దలవడం అభిమానులు అలవాటు పడిన విషయం. కానీ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ విషయంలో ఆ ట్రెండ్ కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
Read Also: SIR: ఉత్తర్ ప్రదేశ్ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?
ఇప్పటివరకు అమెరికాలో ఈ సినిమా సుమారు 1.90 లక్షల డాలర్ల గ్రాస్ మాత్రమే సాధించగా, దాదాపు 6,600 టికెట్లు అమ్ముడయ్యాయి. (Prabhas The Raja Saab) ప్రభాస్ స్థాయిలో ఉన్న స్టార్‌కు ఇది ఆశాజనక సంఖ్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల బాహుబలి రీ-రిలీజ్‌తో మళ్లీ బాక్సాఫీస్ హంగామా సృష్టించిన ప్రభాస్‌కు, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిరాశ కలిగిస్తున్నాయి.
అయితే, ప్రమోషన్లు పెరగడం, ట్రైలర్ లేదా పాటల ప్రభావంతో విడుదలకు దగ్గరగా పరిస్థితి మారవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హారర్ కామెడీ జానర్ కావడం వల్ల ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందా లేదా అనేది విడుదల తర్వాతే తేలనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: