हिन्दी | Epaper

The Raja Saab : ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ!

Sudheer
The Raja Saab : ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ (The Raja Saab ) . ఈ మూవీ కొత్త అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ వారంలో డబ్బింగ్ స్టార్ట్

అంతేకాక, ప్రభాస్ స్వయంగా ఈ సినిమా కోసం తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ చెబుతారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. డబ్బింగ్ పనులు ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభం కానున్నాయని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ప్రభాస్ హిందీ మార్కెట్ పట్ల చూపిస్తున్న ప్రత్యేకతను మరొకసారి రుజువు చేస్తోంది. భయానకత, హాస్యం, మిస్టరీల మేళవింపుతో ఈ సినిమా పూర్తి వినోదాన్ని అందించనుందని సమాచారం.

ప్రమోషన్లు షురూ

డబ్బింగ్ పనులు పూర్తయ్యిన వెంటనే మూవీ ప్రమోషన్లకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాస్ “సలార్” వంటి భారీ సినిమాల విజయంతో మంచి ఫారమ్‌లో ఉన్నందున, ఈ సినిమా పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్ల దశలో చిత్రబృందం పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమవుతోంది. ‘ది రాజాసాబ్’ మరింత సమాచారం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Chicken Rates: భారీగా పెరిగిన చికెన్ ధరలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

📢 For Advertisement Booking: 98481 12870