దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన “ది గర్ల్ ఫ్రెండ్”(The Girlfriend) చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచీ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్ నుంచే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలమైన వసూళ్లను సాధిస్తోంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.20.4 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఈ తాజా వసూళ్ల వివరాలను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Read Also: Stree movie: హారర్ అభిమానులు తప్పక చూడాల్సిన మూవీ
క్లైమాక్స్ ప్రభావంతో యువతి చేసిన పని వైరల్
The Girlfriend: సినిమా చూసిన ఒక యువతి చేసిన చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. క్లైమాక్స్ ముగిసిన తర్వాత ఆమె దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసింది. “ఈ క్లైమాక్స్ నాకు ఇది ధరించే అవసరం లేదనిపించింది” అంటూ తన చున్నీని తీసేసింది. ఆమె చేసిన ఈ పనిని దర్శకుడు ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టడం, కౌగిలించుకోవడం కూడా జరిగింది.
నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు
ఈ ఘటన ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ “ఇదేనా మహిళా సాధికారత?” “స్వేచ్ఛ పేరు మీద ఇలాంటి ప్రదర్శనలు అవసరమా?”
అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఆమె తన భావాన్ని ధైర్యంగా వ్యక్తం చేసిందని సమర్థిస్తున్నారు. అయితే, పెద్ద సంఖ్యలో వినియోగదారులు “సాధికారతకు చున్నీ తీసేయడం ప్రమాణం కాదు” అంటూ స్పందిస్తున్నారు.
చర్చనీయాంశంగా మారిన సినిమా ప్రభావం
సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్న తరుణంలో, ఈ ఘటన కూడా చిత్రానికి మరింత ప్రచారం తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాలపై కొత్త చర్చలకు ఇది దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: