‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు, హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్ (Avika Gor)జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆమె తన ప్రియుడు, సామాజిక సేవకుడు మిలింద్ చంద్వానీతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం అభిమానులకు తెలిసిందే. ఈ జంట తమ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఈ వేడుకను అభిమానుల ముందు కూడా పంచుకోవడం విశేషం.
News telugu: Papaya seeds-బొప్పాయి గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
అవికా–మిలింద్ (Avika Gor – Milind Chandwani) పెళ్లిలో అత్యంత విశేషంగా నిలిచింది ఏమిటంటే, ఈ వివాహం ‘పతీ పత్నీ ఔర్ పంగా’ రియాల్టీ షోలోనే జరగడం. సాధారణంగా రియాల్టీ షోల్లో జంటలు తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే పంచుకుంటారు. కానీ, ఈ జంట మాత్రం షో సెట్‌లోనే ఏడడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్నమైన ఆలోచన వారికి అభిమానుల దగ్గర మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ వేడుకకు టెలివిజన్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. హీనా ఖాన్, రాఖీ సావంత్, ఫరా ఖాన్, రాఖీ జైస్వాల్, రుబీనా దిలైక్ వంటి తారలు ఈ వివాహ వేడుకలో పాల్గొని మెరుపులు నింపారు. పెళ్లి అనంతరం అవికా–మిలింద్ చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం తారాస్థాయి రీతిలో జరిగి, అభిమానుల్లోనూ పెద్ద ఉత్సాహాన్ని రేకెత్తించింది.