సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Day1 Collection: ‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

జయకృష్ణ హీరోగా అరంగేట్రం
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో జయకృష్ణ తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మహేష్ బాబు స్వయంగా విడుదల చేశారు.
గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగళపురం’ (Srinivasa Mangalapuram)అనే టైటిల్ ఖరారు చేశారు. విడుదలైన పోస్టర్‌లో జయకృష్ణ బైక్‌పై వెళ్తూ శత్రువులపై తుపాకీ గురిపెట్టిన యాక్షన్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు.
స్టార్ టెక్నీషియన్స్‌తో మూవీ
‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో(Srinivasa Mangalapuram) గుర్తింపు పొందిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: