యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేకంగా సినిమా సెకండ్ హాఫ్ లో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.
గతంలో రుక్మిణీ వసంత్ పేరు ప్రచారం
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. తాజాగా శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి రావడంతో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. శ్రద్ధా కపూర్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం ఎంపిక అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా మూవీ యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
యాక్షన్ & ఎమోషనల్ డ్రామా
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో సరికొత్త మేకోవర్‌లో ఎన్టీఆర్‌ను చూపించనుందని టాక్. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించిన పలు షెడ్యూల్లు పూర్తయ్యాయి. స్టార్ క్యాస్టింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా మూవీ టీమ్ అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
Read Also : Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి