నటిమణి సమంత రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గుసగుసలుగా వినిపిస్తున్న వేళ, సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఓ ఈవెంట్‌లో దిగిన ఫోటోల్ని షేర్ చేసిన ఆమె, వాటిలో రాజ్ నిడిమోరుతో ఉన్న ఒక క్లోజ్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురాని సమంత, ఈసారి ఆ ఫోటోకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
Latest News: AP Investments: పెట్టుబడుల జోరు–చంద్రబాబు దిశానిర్దేశం!
తన పోస్ట్‌లో సమంత ఇలా రాసుకొచ్చారు . “గత ఏడాదిన్నరగా నా జీవితంలో కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకున్నాను. ఆ నిర్ణయాల వల్ల నేర్చుకున్న ప్రతి పాఠానికి, నాకు ఎదురైన ప్రతి అనుభవానికి కృతజ్ఞతగా ఉన్నాను.” ఈ లైన్లు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. సమంత ఈ వ్యాఖ్యల ద్వారా రాజ్ నిడిమోరుతో ఉన్న బంధాన్ని పరోక్షంగా అంగీకరించిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, రాజ్ ఆమెతో కలిసి “సిటాడెల్ ఇండియా” వెబ్ సిరీస్‌లో పని చేస్తున్నారు, అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ వర్గాల ప్రకారం, ఈ పోస్టుతో సమంత తన సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించే దిశగా అడుగు వేసిందని భావిస్తున్నారు. గతంలో నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా సమయం ఒంటరిగా గడిపి, మళ్లీ జీవితాన్ని సంతోషంగా మలచుకునే ప్రయత్నం చేస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. “సామ్ మళ్లీ తన లైఫ్‌ను పాజిటివ్‌గా రీబిల్డ్ చేసుకుంటోంది” అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఈ ఇన్‌స్టా పోస్ట్ సమంత-రాజ్ నిడిమోరు రూమర్స్‌కు మరింత మసాలా జోడించి, సినీ వర్గాల్లో కొత్త చర్చకు నాంది పలికింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/