మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన చిన్న బడ్జెట్ చిత్రం ‘సైయారా’ (Saiyaara ) బాక్సాఫీసు వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. హీరోగా అహాన్ పాండే, హీరోయిన్‌గా అనీత్ పడ్డా నటించిన ఈ సినిమా ప్రేమకథ నేపథ్యంగా రూపొందింది. సాధారణంగా చిన్న ప్రేమకథల చిత్రాలు పరిమిత కలెక్షన్లకే మట్టికరవుతుంటే, ‘సైయారా’ మాత్రం ఆ నిబంధనలన్నింటినీ తిరగరాసింది.
రూ.404 కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు స్థాయి కలెక్షన్లు
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిలో భారతదేశంలోనే రూ.318 కోట్లు, విదేశాల్లో రూ.86 కోట్లు వసూలయ్యాయని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇండియన్ లవ్ స్టోరీల చరిత్రలో ఇప్పటివరకు నమోదు అయిన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది.
కంటెంట్‌కు బ్రాండ్ ప్రమోషన్ తోడైతే ఇదీ ఫలితం
సినిమా సాంకేతిక నిపుణుల తక్కువ అనుభవం, కొత్త నటులతో వచ్చినప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటం, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సినిమాను విజయవంతం చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ వంటి బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయి. ‘సైయారా’ విజయం సినీ పరిశ్రమకు చిన్న చిత్రాల వైపు దృష్టిని మళ్లించేలా మారింది.
Read Also : Rangeen Review : రంగీన్ సిరీస్ రివ్యూ!