ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా “నిష్ప్రయోజకంగా మారింది” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. వర్మ ట్వీట్‌లో పేర్కొన్నట్లు, ఇప్పటి విద్యా విధానం కాలం చెల్లిపోయిందని, పాత పద్ధతుల్లో చదువుకోవడం ఇక ఫలితం ఇవ్వదని అన్నారు. “ఒక క్లిక్‌తో లక్షల డేటాను విశ్లేషించి సమాధానం చెప్పగలిగే యుగంలో, విద్యార్థులు సంవత్సరాల తరబడి విషయాలను జ్ఞాపకం పెట్టుకోవడం అవసరం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Health Tips: గర్భిణీలు జామపండ్లు తినొచ్చా?
విద్యలో విప్లవాత్మక మార్పు అవసరమని వర్మ వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ(RGV) అభిప్రాయప్రకారం, భవిష్యత్తు విద్య పుస్తకాలపై ఆధారపడేలా కాకుండా, ఏఐ టూల్స్‌ను సృజనాత్మకంగా వినియోగించుకునే సామర్థ్యం నేర్పించే విధంగా ఉండాలని చెప్పారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు తమ బోధన పద్ధతులను మార్చుకుని, పరీక్షల్లో కూడా ఏఐని సహాయక సాధనంగా అనుమతించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ఏఐ పరిణామం కోసం ఎవరు వేచి ఉండదని, మార్పును అర్థం చేసుకోలేని విద్యా వ్యవస్థలు సమయానుకూలంగా నశిస్తాయని హెచ్చరించారు
ఏఐ మిమ్మల్ని చంపదు.. కానీ పట్టించుకోదు
వర్మ తన ట్వీట్‌లో మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు “ఏఐ మిమ్మల్ని చంపదు, కానీ పట్టించుకోదు. ఏఐని వాడలేని వారు భవిష్యత్తులో ఏఐ చేతనే వాడబడతారు” అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. సాంకేతిక యుగంలో విద్యా వ్యవస్థ ఎలా మారాలి, భవిష్యత్తులో విద్యార్థులు ఏ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి అన్న అంశంపై ఈ ట్వీట్ కొత్త ఆలోచనలకు దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: