Ranveer Singh controversy : బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై బెంగళూరులో మతాభిమానాలు దెబ్బతీసినట్లు ఆరోపణలతో కేసు నమోదైంది. కాంతార సినిమాలోని దైవం పాత్రను ఆయన మిమిక్ చేశారనే అంశమే ఈ వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై Bengaluru City Police ఫిర్యాదు నమోదు చేసింది.
ఈ సంఘటన 2025 నవంబర్‌లో గోవాలో జరిగిన (Ranveer Singh controversy) అంతర్జాతీయ సినిమా ఉత్సవం (IFFI) ముగింపు వేడుకలో చోటుచేసుకుంది. స్టేజ్‌పై రణవీర్, కాంతార క్లైమాక్స్ సన్నివేశాన్ని మిమిక్ చేస్తూ ప్రదర్శన ఇవ్వగా, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రిషబ్ శెట్టి ఆడియెన్స్‌లో ఉన్నారు. అయితే ఈ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
నగర న్యాయవాది ప్రశాంత్ మేతల్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేయడానికి అనుమతి పొందారు. ఆయన వాదన ప్రకారం, బూత కోలా సంప్రదాయాల్లో పూజించే చవుండి దైవాన్ని తప్పుగా చూపించడం మత భావాలను అవమానించడమేనని పేర్కొన్నారు. రణవీర్ వ్యాఖ్యలు సమాజంలో అపోహలు, విభేదాలు సృష్టించే అవకాశం ఉందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన రణవీర్ సింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో క్షమాపణ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మాజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై ఏప్రిల్ 8న తదుపరి విచారణ జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: