हिन्दी | Epaper

Prabhas controversy : ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

Sai Kiran
Prabhas controversy : ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

Prabhas controversy : పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదుగుదలతో ఆయనపై నెగటివిటీ, ట్రోలింగ్ జరుగుతోందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన నటుడిగా ఆయన పేరు నిలిచింది.

అయితే ప్రభాస్ ఎదుగుదల కొంతమందికి నచ్చలేదా? ఆయనను (Prabhas controversy) వెనక్కి లాగేందుకు అప్పట్లోనే కుట్రలు జరిగాయా? అనే ప్రశ్నలు మరోసారి వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ది రాజాసాబ్ సినిమాపై వచ్చిన నెగటివ్ ప్రచారంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకుంది. సినిమా విడుదలకుముందే డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.

Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

Prabhas
Prabhas

ఇదే తరహా ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఛత్రపతి సినిమా తర్వాత ఒక ప్రముఖ మ్యాగజైన్‌లో వచ్చిన కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ లుక్స్, ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉన్నాయని, అతని ఎదుగుదలను ఆపకపోతే భవిష్యత్తులో అతడికి అడ్డుకట్ట ఉండదని పేర్కొన్నట్టు అభిమానులు గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ‘ది రాజాసాబ్’ సినిమా ఇప్పుడు ఓటీటీకి రానుంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సుమారు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలో సినిమాకు కొత్త జీవం దక్కుతుందేమోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

కన్నీరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

📢 For Advertisement Booking: 98481 12870