పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కలయిక అంటేనే మ్యూజికల్ చార్ట్‌బస్టర్‌ల గ్యారెంటీ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఎప్పుడూ అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచాయి. ప్రత్యేకంగా పవన్ వీరాభిమాని అయిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని పాటలు ఈ ముగ్గురి కలయికకు తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాయి. ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురి (పవన్, దేవి, హరీష్) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మొదటి పాట ‘దేఖ్‌లేంగే సాలా’ ప్రోమో విడుదల కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రోమో అభిమానుల్లో నూతనోత్తేజాన్ని నింపి, సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది.
News Telugu: AP: రాష్ట్ర అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతగానో సహకరించారు: చంద్రబాబు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని మొట్టమొదటి పాట ‘దేఖ్‌లేంగే సాలా’ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే బాణీకి, భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యానికి ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ డడ్లాని గాత్రం మరింత పవర్‌ను జోడించింది. ప్రోమోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ అత్యంత స్టైలిష్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూస్తుంటే, దివంగత లెజెండరీ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ స్వాగ్ గుర్తుకు వస్తుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ ప్రోమో వైరల్‌గా మారగా, పూర్తి పాటను డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

రీసెంట్ గా ‘ఓజీ’ (దే కాల్ హిమ్ ఓజీ) విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ప్రాముఖ్యత పెరిగింది. ‘ఓజీ’ మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం పోలీస్ నేపథ్యంలో రూపొందుతున్న ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా మరియు శ్రీ లీల నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com