Prema O Prema song : Police Complaint సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటి Varalaxmi Sarathkumar, నటుడు Naveen Chandra జంటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నుంచి విడుదలవుతున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
తాజాగా చిత్రంలోని మెలోడీ సాంగ్ “ప్రేమ ఓ ప్రేమ” విడుదలైంది. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ పాటను అన్విక ఆడియోస్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు సుధాకర్ మారియో అందించిన ట్యూన్ యూత్‌ను ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ పాట ఈ ఏడాది హిట్ లవ్ సాంగ్స్ జాబితాలో నిలుస్తుందని దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
Read also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం
ఈ చిత్రం హారర్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ (Prema O Prema song) మేళవింపుతో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ప్రధాన పాత్రలతో పాటు Ragini Dwivedi, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సాంకేతికంగా కూడా ఈ సినిమా బలంగా ఉందని చిత్రబృందం చెబుతోంది. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: