శ్రియా రెడ్డి: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG Movie) లో శక్తివంతమైన ఫస్ట్ లుక్! పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (Original Gangster) కోసం అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో, చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమా నుండి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఫస్ట్ లుక్ విడుదలయింది, ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఈ సినిమాలో శ్రియా ‘గీత’ అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె చీరకట్టులో ఉన్నప్పటికీ, కోపంతో తుపాకిని ఎక్కుపెట్టి సన్నివేశం చూపించారు. ఈ ఇంటెన్స్ లుక్ ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుందనే ఆసక్తిని కలిగిస్తోంది. ప్రేక్షకుల్లో, గీత ఎవరి మీద గన్ పట్టిందో తెలుసుకోవాలనే ఉత్కంఠ పెరిగింది. ఆసక్తికరమైన సస్పెన్స్ కోసం ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.

OG Movie
సెప్టెంబర్ 25నసెప్టెంబర్ 25న
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లో పరిచయం అవుతున్నారు. ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోందని, ప్రకాశ్ రాజ్, శామ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Entertinment) పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. ‘ఓజీ’ (OG Movie) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు, అనేక భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రియా రెడ్డి ‘ఓజీ’ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నారు?
శ్రియా రెడ్డి సినిమాలో ‘గీత’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఎలా చూపించబడింది?
చీరకట్టులో, కోపంతో తుపాకిని ఎక్కుపెట్టి, ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: