స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ జూన్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే మూవీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, సినిమా టీమ్‌కి అనూహ్యమైన షాక్ తగిలింది – మూవీకి సంబంధించిన కీలక హార్డ్‌డ్రైవ్ (Hard Disk) చోరీకి గురైంది.సినిమాకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్(Hard Disk)ను ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం
కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్‌డ్రైవ్(Hard Disk)ను ముంబయిలోని HIVE స్టూడియోస్ వారు ఓ ప్రైవేట్ కొరియర్ ద్వారా ఫిల్మ్‌నగర్‌లోని విజయ్‌కుమార్ ఆఫీస్‌కు పంపించారు. అయితే ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్‌బాయ్ రఘు తీసుకున్నాడు. అతడు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్‌డ్రైవ్(Hard Disk)ను చరిత అనే మహిళకు అప్పగించాడు. ఆ అమ్మాయి తన ప్రియురాలు అని తెలిసింది. ఇక అప్పటి నుంచి వారు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరిత కలిసి హార్డ్‌డ్రైవ్(Hard Disk)ను దొంగిలించారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కుమార్ హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హీరో విష్ణు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సినిమా రన్‌టైమ్ గురించి క్లారటీ ఇచ్చారు. ఈ సినిమా రన్ టైమ్ 3గంటల 10 నిమిషాలు ఉంటుందని విష్ణు వెల్లడించారు. క్లైమాక్స్‌లో స్టోరీ ఫ్లో కంటిన్యూ చేయడానికి ఫైనల్ ఎడిటింగ్‌లో కొన్ని ప్రభాస్ సన్నివేశాలను తీసేశామని చెప్పారు. అయినా ప్రభాస్ స్క్రీన్ టైం దాదాపు 30 నిమిషాలు ఉంటుందని, కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని విష్ణు పేర్కొన్నారు. కాగా, విష్ణు కన్నప్ప (Kannappa) పాత్రలో నటిస్తుండగా, స్టార్ హీరో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కాజల్ ఆగర్వాల్, శరత్ కుమార్, అర్పిత్ రాంకా, ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also: Vijay Deverakonda : డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ