పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితం, సమాజంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తన రెండో పెళ్లి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం పట్ల రేణూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాజానికి అవసరమైన విషయాలను విస్మరించి, వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే చర్చ జరగడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నా పెళ్లి పై కాదు సమాజం పై దృష్టి పెట్టండి
“నేను ఆ పాడ్‌కాస్ట్‌లో మహిళల సమస్యలు, వాతావరణ మార్పులు, ఆర్థిక స్థిరత వంటి అనేక సామాజిక అంశాల గురించి మాట్లాడాను. కానీ మీడియా వాళ్లకు, నెటిజన్లకు నేను రెండో పెళ్లి చేసుకుంటానా లేదా అన్నదే ఆసక్తికరంగా కనిపించింది” అని పేర్కొన్నారు. “ఒక 44 ఏళ్ల మహిళ జీవితంలో పెళ్లి అన్నదే ఓ విశేషమైన విషయం కావాలి? మనం సమాజంలో మార్పు కోసం మాట్లాడకూడదా?” అని ఆమె ప్రశ్నించారు.

రేణూ మాటలు కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరం
రేణూ దేశాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత విషయాలపై కాకుండా, సామాజిక అంశాలపై చర్చ అవసరమని ఆమె స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి, సమాజంలో మార్పు అవసరాన్ని ప్రస్తావించిన రేణూ మాటలు కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని కలిగిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం గౌప్యంగా ఉంచాలని, మహిళలను వ్యక్తులుగా గుర్తించి గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు.