हिन्दी | Epaper

Manchu Manoj : మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు

Sudheer
Manchu Manoj : మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన సంఘటనలపై హృదయవిదారక వ్యాఖ్యలు చేశారు. తన అన్న మంచు విష్ణు(Manchu Vishnu)తో ఉన్న విభేదాలు, కుటుంబంలో నెలకొన్న అసౌహార్య పరిస్థితులు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మనోజ్ తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా జీవిస్తున్నామని తెలిపారు. తన భార్య ప్రారంభించిన బొమ్మల కంపెనీలో కథలు రాయడంతో పాటు, ఆర్ట్స్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఆత్మగౌరవంతో జీవించడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అయితే అనుకోని కష్టాలు ఎదురయ్యాయని, అవి తాను ఊహించలేనివని, తన బాధను మీడియా ముందు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

“నీకు ఏ సంబంధం?”

తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులందరం మళ్లీ కలిసామని, కానీ అది ఒక్కరికి నచ్చలేదని మనోజ్ తెలిపారు. కళాశాలలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పేందుకు తనను ఆశ్రయించారని, కానీ తాను మాట్లాడితే “నీకు ఏ సంబంధం?” అనే ప్రశ్న ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్యపై విద్యాసంస్థలో పనిచేసే వారిని ఉపయోగించి ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో తన భార్యను లాగారని, అప్పుడు తన మనస్సు తట్టుకోలేక ముక్కలైందని బాధతో చెప్పారు. ఆమెకు అన్నీ తానేనని, కానీ తాను ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలేదని వివరించారు.

తండ్రి నేర్పిన నీతిని తానే పాటిస్తున్న

తన తండ్రి మోహన్ బాబుకు కాళ్లు పట్టుకుని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని భావోద్వేగంతో చెప్పారు. కానీ తాను చేయనిది ఒప్పుకుంటే, తన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాననే సందేహం కలుగుతోందన్నారు. తండ్రి నేర్పిన నీతిని తానే పాటిస్తున్నానని, అందుకే తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. తాము మళ్లీ ఒక్కటవాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సమస్యలు సృష్టించిన వారు తమ తప్పును ఓ రోజు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Kavitha Letter : ఆ లేఖ రాసింది నేనే – కవిత క్లారిటీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

మళ్లీ వస్తున్న కాంచన, కొత్త స్పష్టతలో రచ్చకు రెడీ

మళ్లీ వస్తున్న కాంచన, కొత్త స్పష్టతలో రచ్చకు రెడీ

📢 For Advertisement Booking: 98481 12870