हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Manchu Manoj : మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

Sudheer
Manchu Manoj : మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన కూతురు దేవసేన శోభా MM తొలి పుట్టినరోజును అద్భుతంగా జరిపారు. మంచు మనోజ్, మౌనిక దంపతులకు గత ఏడాది పాప జన్మించగా, ఇప్పుడు ఆమె పుట్టినరోజును కుటుంబసభ్యులు కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నారి దేవసేన వారి కుటుంబానికి వెలుగు, ఆనందాన్ని తెచ్చిందని, ఆమె తొలి బర్త్‌డే ఎంతో స్పెషల్ అని తెలుస్తుంది.

మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

తన ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోజ్, తన కూతురిపై ప్రేమను వ్యక్తం చేస్తూ హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు. “సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురు నలుగురు అయ్యాం. నాలుగు పిల్లర్లు, అందమైన కుటుంబం. దేవసేన నువ్వు మా జీవితానికి వెలుగు, ధైర్యం, సంతోషం తెచ్చావు. అమ్మ, నేను, ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీ జీవితం ఆనందంగా సాగాలి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం” అంటూ మనోజ్ ఎమోషనల్‌గా రాశారు.

manoj devasena
manoj devasena

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

మంచు మనోజ్ పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవసేనను కౌగిలించుకున్న మనోజ్, మౌనిక, ధైరవ్ ఉన్న అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారి దేవసేనను చూసి నెటిజన్లు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మంచు లక్ష్మి ప్రత్యేక శుభాకాంక్షలు

దేవసేన పుట్టినరోజును పురస్కరించుకుని మంచు లక్ష్మి కూడా ఓ ప్రత్యేక పోస్ట్ షేర్ చేశారు. తన తమ్ముడి కూతురికి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవసేనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఫ్యాన్స్ కూడా దేవసేనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. మంచు కుటుంబం మళ్లీ ఒక్కటై ఈ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870