సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి కొత్త దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వంలో “కే-రాంప్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్‌గా యుక్తి తరేజా నటించగా, రజేశ్ డాండా మరియు శివ బొమ్మక్ నిర్మాతలుగా వ్యవహరించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, సతీష్ రెడ్డి మసం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలాలు. కథ పరంగా చూస్తే..ధనిక కుటుంబంలో పుట్టిన కుమార్ (కిరణ్ అబ్బవరం) అల్లరి జీవితం గడిపే నిర్లక్ష్య యువకుడు. అతనిలో మార్పు రావాలన్న ఉద్దేశ్యంతో తండ్రి (సాయి కుమార్) అతడిని కేరళలోని కాలేజీకి పంపుతాడు. అక్కడ మర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ మర్సీకి ఉన్న అరుదైన మానసిక సమస్య కథలో ప్రధాన మలుపు అవుతుంది. ఆ సమస్య ఏమిటి? కుమార్ దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది కథ .
Latest News: IND Vs AUS: వర్షం ఆటంకం కానున్నదా?
సినిమా లో కిరణ్ అబ్బవరం తన ఎనర్జీ, హాస్య టైమింగ్, నిర్లిప్తమైన బాడీ లాంగ్వేజ్‌తో పూర్తిగా ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి రోల్స్ చేశాడు కానీ ఈసారి మరింత సహజంగా కనిపించాడు. ముఖ్యంగా రెండో భాగంలో అతని పెర్ఫార్మెన్స్‌లో స్పష్టమైన ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. యుక్తి తరేజా పాత్రకు చిత్రంలో మంచి ప్రాధాన్యం ఉంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు సాంగ్స్‌కే పరిమితం అవుతుంటే, ఇక్కడ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. మానసిక వ్యాధితో ఉన్న యువతిగా ఆమె నటన నమ్మకాన్ని కలిగించింది. ఇంటర్వల్ తరువాత కామెడీ సీన్లు ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటాయి. హీరోయిన్-హీరో కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఫస్ట్ హాఫ్ కాస్త రొటీన్‌గా అనిపించినప్పటికీ.. రెండో భాగంలో తండ్రి-కొడుకు భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎడిటింగ్ కాస్త స్పీడ్ ఉంటె బాగుండు. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. “కలలే కలలే” పాట విపరీతంగా ఆకట్టుకుంది. సతీష్ రెడ్డి మసం సినిమాటోగ్రఫీ తెరపై అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా “కే-రాంప్” ప్రేక్షకుల చేత వావ్ అనిపించేలా ఉంది. దీపావళి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద లక్ష్మి బాంబులా బాగా పేలింది. చక్కటి వినోదం , సెంటిమెంట్ , ట్విస్ట్ లతో అదరగొట్టింది.
వార్త రేటింగ్ 3.25 /5