యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijaydevarkonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ (kingdom) సినిమా విడుదల తేదీ ఖరారైంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన స్పెషల్ ప్రోమో ద్వారా ఈ నెల జులై 31న సినిమా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.
వీరమల్లుకు గట్టి పోటీగా కింగ్‌డమ్
జులై 24న పవన్ కళ్యాణ్ నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బౌన్ బ్యాక్ మూవీగా భావిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో కింగ్డమ్ చిత్రం వీరమల్లుకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనివ్వనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జులైలో బాక్సాఫీస్ హీట్ – ప్రేక్షకులకు పండగే
ఈ రెండు పెద్ద సినిమాలు జులైలో విడుదల కావడం సినిమాప్రేమికులకు పండుగలా మారనుంది. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న కింగ్డమ్ యువతలో ఆసక్తిని రేపుతుంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు వీరమల్లును గ్రాండ్ గా సక్సెస్ చేయాలని ఉత్సాహంలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు జనరాలవైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఒకదానికి ఒకటి పోటీగా నిలవడం అనివార్యం. ఫైనల్‌గా జులై బాక్సాఫీస్ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి.
Read Also : Chandrababu : రెండు రోజులపాటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన