Jana Nayagan box office : తలపతి విజయ్ చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ పై అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఇంకా సీబీఎఫ్‌సీ నుంచి పూర్తి సర్టిఫికెట్ రాకపోయినా, సినిమా చుట్టూ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. విజయ్ చివరిసారి వెండితెరపై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ థియేటర్లలో సంబరాలకు సిద్ధమవుతున్నారు.
తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా ప్రారంభం కాకపోయినా, విదేశీ మార్కెట్లలో మాత్రం సినిమా దుమ్మురేపుతోంది. ప్రీ–సేల్స్ ఆధారంగా చూస్తే, విజయ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్‌లలో ఇది ఒకటిగా నిలవబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, విజయ్ స్టార్ పవర్ ఒక్కటే సినిమాకు బలంగా మారింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు (Jana Nayagan box office) యూకే, మలేషియా, ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) వంటి ఓవర్సీస్ మార్కెట్ల నుంచి భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.60 కోట్ల మార్క్‌ను దాటాయి. ఇందులో ఎక్కువ భాగం ఓపెనింగ్ డే టికెట్లకే కావడం విశేషం. ఈ ట్రెండ్ కొనసాగితే, తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించే అవకాశం ఉందని అంచనా. అలా జరిగితే, ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తర్వాత విజయ్‌కు ఇది మూడో సెంచరీ ఓపెనర్‌గా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: