Jailer 2 : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ 2 షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మొదటి భాగం సాధించిన ఘన విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి భాగంలో అతిథి పాత్రలో కనిపించిన ఆయన, ఈసారి మాత్రం పూర్తి స్థాయి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. “ఈసారి నా పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది. ప్రేక్షకులు నా నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు,” అని శివరాజ్‌కుమార్ పేర్కొన్నారు.
Read also: Actor Sivaji Says Sorry For Comments: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివాజీ
ఇప్పటికే ఒక రోజు షూటింగ్ పూర్తి చేసినట్లు, (Jailer 2) జనవరిలో మరికొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. ‘జైలర్ 2’ కథ మొదటి భాగానికి నేరుగా కొనసాగింపుగా ఉంటుందని, పాత్రల ప్రాధాన్యత మరింత పెరుగుతుందని చెప్పారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్‌లాల్, విద్యాబాలన్, ఎస్.జే.సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ‘జైలర్ 2’ సినిమాను 2026 ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన విజయాన్ని ఈ సీక్వెల్ అందుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: