Inspection Bungalow: ఒకప్పుడు హారర్ సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందేవి కావు. భయానక కథలను ఇష్టపడే ఒక చిన్న వర్గం మాత్రమే చూసేవారు. అయితే, కాలం మారింది. ఇప్పుడు అదే హారర్ కంటెంట్‌కి ఓటీటీల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రతి శుక్రవారం కొత్త హారర్ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు ముందుగా ఏది చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Abhishek Sharma: కొత్త టాటూ వేయించుకున్న అభిషేక్ శర్మ
ఈ నేపథ్యంలో ఓ కొత్త మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’. సైజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో శబరీష్ వర్మ, షాజు శ్రీధర్, జయన్, వీణా నాయర్, బాలాజీ శర్మ, సెంథిల్ కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను జీ 5లో నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే ఒక గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కి సబ్‌ఇన్‌స్పెక్టర్ విష్ణు బదిలీ అవుతాడు. ఆ గ్రామానికి చేరుకున్న అతను, పోలీస్ స్టేషన్‌ను పాత ప్రభుత్వ బంగ్లాలో ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కానీ ఆ బంగ్లాలోకి అడుగు పెట్టిన తర్వాత అతనికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ భయంకరమైన బంగ్లాలో ఏమి దాగి ఉంది? ఆ సంఘటనల వెనుక రహస్యమేంటి? అనేదే కథ యొక్క అసలు సస్పెన్స్‌గా నిలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: