हिन्दी | Epaper

Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ మృతి

Sudheer
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ మృతి

తెలుగు చిత్రపరిశ్రమలో తన ప్రత్యేకమైన తెలంగాణ యాస, తేలికపాటి హాస్యంతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని నెలలుగా డయాలసిస్‌తో బతుకును నెట్టుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి హఠాత్తుగా క్షీణించడంతో ఇటీవల ఆయనను వెంటిలేటర్‌కు తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోయాయి.

ఆర్థిక సహాయానికి విఫలమైన ప్రయత్నాలు

ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అత్యవసరమవుతుందని వైద్యులు సూచించగా, ఆయన కుమార్తె శ్రావంతి రూ. 50 లక్షల ఆపరేషన్‌ ఖర్చును భరించలేక ఆర్థిక సహాయం కోరారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వెలువడ్డాయి. ప్రభాస్ సహాయం చేసారనే వార్తలు వాదనలు వినిపించగా, అవి పూర్తి అవాస్తవమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్, విశ్వక్ సేన్, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రి కొంత ఆర్థిక సహాయం చేసినట్లు తెలిసింది. అయినా సరే, తగిన కిడ్నీ దాత లభించకపోవడం వల్ల ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది.

సినీ ప్రముఖుల నివాళులు, అభిమానుల కంటతడి

గబ్బర్ సింగ్, అదుర్స్, డీజే టిల్లు వంటి హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిపై పలువురు నటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసే హాస్య పాత్రలు మరచిపోలేనివని, ఇకపై టెలివిజన్ స్క్రీన్ మీద ఆయనను చూడలేమన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా #RIPFishVenkat అంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.

Read Also : Hydraa : హైదరాబాద్లో వర్షం.. బోట్లలో ప్రజల తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870