Ekō Ending Explained : Ekō మిస్టరీ థ్రిల్లర్‌గా మెల్లగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. Dinjith Ayyathan దర్శకత్వంలో, Bahul Ramesh కథ–సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం నాన్-లీనియర్ నేరేటివ్‌లో సాగుతుంది. అందుకే చివరి క్లైమాక్స్ చాలా మందిని అయోమయంలో పడేస్తుంది.
Ekō లో ముఖ్యమైన పాత్రలు ఎవరు?
ఈ కథ అర్థం కావాలంటే నాలుగు పాత్రలపై దృష్టి పెట్టాలి.
కురియాచన్ (Saurabh Sachdeva)
అతడు ధనవంతుడు, శక్తివంతుడు, (Ekō Ending Explained) అనేక భార్యలు–పిల్లలు ఉన్న వ్యక్తి. కుక్కల పెంపకం, శిక్షణ అతని వృత్తి. ఓ కత్తిపోటు కేసు తర్వాత అతడు అదృశ్యమవుతాడు. కానీ ఆ దాడి అతడు చేయలేదు – అది మరో వ్యక్తి చేశాడు. అయినా, అతడి గతం చీకటిగా ఉంటుంది.
పీయోస్ (Sandeep Pradeep)
మలాథి చెట్టత్తిని చూసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ నిజానికి అతడు కురియాచన్ అదృశ్యం వెనుక నిజం తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి.
మోహన్ పోతన్ (Vineeth)
కుక్కల ట్రైనర్, కురియాచన్ పాత స్నేహితుడు. తరువాత కురియాచన్ ద్రోహం చేసి అతడిని జైలుకు పంపిస్తాడు.
సోయి / మలాథి చెట్టత్తి
ఈ కథకు అసలు కేంద్ర బిందువు. ఆమె గతంలో జరిగిన అన్యాయం ఈ సినిమా మొత్తం నడిపిస్తుంది.
Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్
కథ అసలు ఎలా మొదలైంది?
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మలేషియాలో జపాన్ పాలన ఉంది. ఆ సమయంలో కురియాచన్, మోహన్ కలిసి అత్యంత తెలివైన అరుదైన కుక్కల జాతిని తెచ్చేందుకు అక్కడికి వెళ్తారు. అక్కడ వారికి సోయి భర్త పరిచయం అవుతాడు – అతడు తరతరాలుగా కుక్కలను శిక్షణ ఇచ్చే వ్యక్తి.
సోయి భర్త పనిమీద తరచూ ఇంటికి దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో కురియాచన్, మోహన్ సోయిపై మోహం పెంచుకుంటారు. చివరికి కుట్ర చేసి ఆమె భర్తను జైలుకు పంపిస్తారు. కుక్కలు మాత్రం సోయిని విడిచిపెట్టడానికి ఒప్పుకోవు. అవి దాడి కూడా చేస్తాయి.
చివరకు కురియాచన్ ఆ కుక్కలను చంపి, “నీ భర్త చనిపోయాడు” అని అబద్ధం చెప్పి సోయిని మోసం చేస్తాడు. ఆమెను కేరళకు తీసుకొచ్చి, ఆ అరుదైన కుక్కల జాతిని తనదిగా మార్చుకుంటాడు.
నిజం బయటపడటం – ప్రతీకారం
ఏళ్ల తర్వాత సోయి ఒంటరిగా జీవిస్తుంది. మోహన్ పోతన్ ఆమె ఇంటికి వచ్చి జరిగిన నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే సోయికి తన గతం మొత్తం అర్థమవుతుంది.
తర్వాత రక్తంతో కురియాచన్ అక్కడికి వస్తాడు. అతడు నేరం ఒప్పుకోకపోయినా, తప్పు చేసినట్టు స్పష్టమవుతుంది. అటవీలో దాక్కుంటాడు. కానీ అతడిని కాపాడాల్సిన కుక్కలే అతడిని ఖైదీగా మారుస్తాయి. ఎందుకంటే…
ఆ కుక్కలను నిజంగా నియంత్రించేది సోయే.
ఆమెనే మోహన్ పోతన్‌ను కూడా కుక్కల ద్వారా కొండ మీద నుంచి తోసేసి చంపిస్తుంది. ఇది ఆమె ప్రతీకారం.
చివరికి ఏమవుతుంది?
పీయోస్, సోయి ఇద్దరికీ ఒకరిపై ఒకరి రహస్యాలు తెలుసు.
పీయోస్‌కు కురియాచన్ ఎక్కడున్నాడో తెలియదు.
సోయికి మాత్రం అన్నీ తెలుసు.
పీయోస్ ఏం చేయలేని పరిస్థితిలో చిక్కుకుంటాడు. కుక్కలు సోయి మాటే వింటాయి.
శక్తి మొత్తం సోయి చేతుల్లోనే ఉంటుంది.
అదే Ekō క్లైమాక్స్ అసలు అర్థం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: