ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి వార్ హీటెక్కుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై చిత్ర బృందం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, కావాలనే ఒక వర్గం ప్రేక్షకులు ఫేక్ ఐడీల ద్వారా సినిమాపై బురద జల్లుతున్నారని డైరెక్టర్ సుధా కొంగర ఆరోపించారు. ఒక అద్భుతమైన కంటెంట్‌తో వచ్చిన సినిమాను కేవలం వ్యక్తిగత ద్వేషంతో అణచివేయాలని చూడటం చిత్ర పరిశ్రమకు ఆరోగ్యకరం కాదని ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Andhra Pradesh: ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
ఈ వివాదం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే వార్తలను సుధా కొంగర కొట్టిపారేశారు. ఈ నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నది రాజకీయ నాయకులు కాదని, సినిమా రంగానికి చెందిన వారేనని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి రేసులో ఉండాల్సిన ఒక పెద్ద హీరో సినిమా వాయిదా పడటంతో, ఆ హీరో అభిమానులు తమ అసూయను ‘పరాశక్తి’ సినిమాపై చూపిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సాధారణంగా పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నప్పుడు ఫ్యాన్ వార్స్ సహజమే అయినప్పటికీ, ఇలా ఒక సినిమా విజయాన్ని అడ్డుకోవడానికి వ్యవస్థీకృతమైన నెగెటివిటీని వ్యాప్తి చేయడం ఆందోళన కలిగించే విషయమని చిత్ర బృందం పేర్కొంది. “సినిమా బాగుంటే ఆదరించండి, లేదంటే వదిలేయండి, కానీ తప్పుడు ప్రచారం చేయకండి” అంటూ మేకర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది, మరి దీనిపై సదరు హీరో అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com