Dhurandhar box office : బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంచనాలను మించి దూసుకుపోతోంది. విడుదలై 19వ రోజునే ఈ సినిమా భారత్‌లో రూ.600 కోట్ల నెట్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘనతతో దర్శకుడు ఆదిత్య ధర్ కోయిమోయ్ డైరెక్టర్స్ ర్యాంకింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించారు.
కోయిమోయ్ డైరెక్టర్స్ ర్యాంకింగ్‌లో హిందీ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. 100 కోట్ల క్లబ్‌లో సినిమా ఉంటే 100 పాయింట్లు, 200 కోట్ల క్లబ్‌కు చేరితే 200 పాయింట్లు ఇలా ప్రతి క్లబ్‌కు తగిన పాయింట్లు లభిస్తాయి. అలాగే టాప్ ఓవర్సీస్ గ్రాసర్స్‌లో చోటు దక్కితే అదనంగా పాయింట్లు వస్తాయి.
Read also: KTR: రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం
‘ధురంధర్’ 500 కోట్ల క్లబ్‌లోకి వచ్చినప్పుడు (Dhurandhar box office) ఆదిత్య ధర్‌కు మొత్తం 700 పాయింట్లు వచ్చాయి. తాజాగా 600 కోట్ల క్లబ్‌ను చేరుకోవడంతో మరో 100 పాయింట్లు చేరి ఆయన ఖాతాలో మొత్తం 800 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో సందీప్ రెడ్డి వంగా, ఎస్.ఎస్. రాజమౌళి, అలీ అబ్బాస్ జాఫర్‌లను అధిగమించి ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు.
రాజమౌళి, అలీ అబ్బాస్ జాఫర్‌లకు కూడా 800 పాయింట్లు ఉన్నప్పటికీ, వారి వద్ద 600 కోట్ల హిందీ నెట్ సినిమా లేకపోవడంతో ఆదిత్య ధర్ వారికి పైగా నిలిచారు. 20వ రోజున ‘ధురంధర్’ రూ.627.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ‘స్త్రీ 2’ను దాటే అవకాశముండటంతో, టాప్-5లోకి చేరే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆదిత్య ధర్ పాయింట్ల విభజన ఇలా ఉంది:
‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ – 200 పాయింట్లు
‘ధురంధర్’ – 600 పాయింట్లు
మొత్తం: 800 పాయింట్లు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: