Dhanush new movie : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకుల్లో ధనుష్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ప్రత్యేకమైన టైటిల్‌తో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ధనుష్ ఇటీవల తెలుగులో ‘కుబేర’ తర్వాత తమిళంలో ‘ఇడ్లీ కడై’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా విభిన్న (Dhanush new movie) కథలను ఎంచుకుంటూ సహజమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తనదైన శైలితో స్టార్ ఇమేజ్‌ను కొనసాగిస్తున్నాడు.
Read also:Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
బాలీవుడ్ సినిమాకు డిఫరెంట్ తెలుగు టైటిల్
ధనుష్ బాలీవుడ్‌లో ‘రాంజనా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలాకాలం తర్వాత ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘అమర కావ్యం’ అనే భిన్నమైన టైటిల్‌తో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, ధనుష్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రేమ, విరహం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ కథకు తెలుగులోనూ అదే భావాన్ని ప్రతిబింబించేలా ‘అమర కావ్యం’ అనే టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను భూషణ్ కుమార్, హిమాన్షు శర్మ, కృష్ణ్ కుమార్ కలిసి నిర్మించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ధనుష్ లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో కూడా నటిస్తున్నాడు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/