యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా సెట్లో తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సన్నిహితురాలు ఛార్మి కౌర్‌తో కలిసి సందడి చేశారు. ప్రభాస్‌ను ప్రత్యేకంగా కలసి సరదాగా ముచ్చటించగా, వీరి సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. పూరీ, ప్రభాస్ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బుజ్జిగాడు కాంబోపై మళ్లీ ఆసక్తి
ప్రభాస్-పూరీ జగన్నాథ్ (Puri-Prabhas) కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు – మేడిన్ చెన్నై’ ఒకప్పుడు యూత్‌లో ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలో, పూరీకి మాత్రం వరుస ఫెయిల్యూర్లతో కాస్త వెనకడుగు పడింది. ఈ నేపథ్యంతో, వీరి మళ్లీ కలయికపై అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది.
ఫ్యాన్స్ ఆశలు – మరోసారి కాంబినేషన్ వస్తుందా?
రాజాసాబ్ సెట్లో పూరీ పర్యటనతో, అభిమానులు “మళ్లీ పూరీ-ప్రభాస్ కాంబినేషన్ వస్తుందా?” అనే ఆసక్తికర చర్చల్లో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో “బుజ్జిగాడు 2 రావాలే”, “ఇట్స్ టైం ఫర్ కమ్‌బ్యాక్ కాంబో” వంటి కామెంట్లు దర్శనమిస్తున్నాయి. పూరీ – ఛార్మి కలిసి రాజాసాబ్ టీమ్‌ను కలిసిన నేపథ్యం మరిన్ని ఊహాగానాలకు దారితీస్తోంది. అసలైన సర్ప్రైజ్ ఏమైనా ఉందా? అనేది వేచి చూడాల్సిందే.
Read Also ; Chandrababu Naidu : సింగపూర్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు