సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లో ‘అతడు’ (Athadu) ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పార్థు పాత్రలో మహేశ్ నటన, త్రివిక్రమ్ టేకింగ్, బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈ చిత్రం బుల్లితెరపై కూడా ఎన్నోసార్లు ప్రసారం అయి ఓ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది.
టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్
ఇటీవల టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. మహేశ్ నటించిన ఒక్కడు, మురారి, ఖలేజా వంటి సినిమాలు తిరిగి విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మహేశ్‌బాబు 50వ పుట్టినరోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకొని ‘అతడు’ ను వరల్డ్ వైడ్ రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆసక్తికరంగా మారాయి. సంవత్సరాల తర్వాత కూడా ‘అతడు’కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ బుకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది.
‘అతడు’ అడ్వాన్స్ బుకింగ్స్
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్లో ‘అతడు’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో పోలిస్తే ‘అతడు’కి ఉన్న బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఎంతటి మక్కువ ఉందో అర్థమవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘అతడు’ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ విడుదల చేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇతర బయ్యర్స్ భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేశారు.
ఒకవైపు మహేశ్‌బాబు బర్త్‌డే, మరోవైపు వీకెండ్, ముఖ్యంగా కొత్త పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అంశాలు కలిసి ‘అతడు’ రీరిలీజ్ కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఘట్టమనేని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఈ సినిమాను 70MM స్క్రీన్‌పై మళ్లీ చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ‘అతడు’ రీరిలీజ్ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : Viral Vayyari: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వైరల్ వయ్యారి పాట.. పూర్తి వీడియో వచ్చేసింది!