హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరై ఈ వేడుకకు మరింత గ్లామర్‌ను అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ లభించింది.
అభిమానులకు ఈ అవార్డు అంకితం – అల్లు అర్జున్
అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన అల్లు అర్జున్.. ఈ గౌరవం తన అభిమానులకే అంకితమని తెలిపారు. “ఈ అవార్డుకు కారణం పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్. అలాగే ‘పుష్ప 1’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయమని ప్రోత్సహించిన రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు. ఇవే లేకపోతే ఈ స్థాయి గుర్తింపు సాధ్యపడేది కాదని” అన్నారు. “పుష్ప 2” చిత్రానికి ఇది మొదటి అవార్డు కావడంతో ఇది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. గద్దర్ అవార్డులు ప్రతీ సంవత్సరం జరగాలని ఆకాంక్షించారు.
పుష్ప డైలాగ్
అవార్డు వేడుకలో చివర్లో ప్రేక్షకులకు ఓ సినిమా డైలాగ్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమతి తీసుకున్నారు. వారు వెంటనే అనుమతించడంతో అల్లు అర్జున్ “నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా…” అంటూ పుష్ప 2 లోని శక్తివంతమైన డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రేక్షకుల నుండి పెద్ద చప్పట్లతో స్పందన రావడంతో వేదికను జై తెలంగాణ, జై హింద్ నినాదాలతో ముగించారు. ఈ వేడుక సినిమాప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
Read Also : South Africa చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా…