పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ (OG) చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం శిఖరాస్థాయికి చేరుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ, అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటించడం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.

ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) భాగస్వామ్యం. మొదట్లో అకీరా సినిమాలో నటిస్తున్నాడనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన నటనలో కాకుండా సంగీత విభాగంలో తన ప్రతిభ చూపించాడు. సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా ‘ఓజీ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వర్క్ చేసినట్టు వెల్లడించాడు. అతనిలో ఉన్న మ్యూజిక్ టాలెంట్ భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగే స్థాయి ఉందని తమన్ అభిప్రాయపడ్డాడు. తండ్రి సినిమాకే వర్క్ చేయడం అకీరాకు గర్వకారణమైందని, ఈ అనుభవం మొత్తం టీమ్‌కు హ్యాపీగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.