బాలకృష్ణ-బోయపాటి శ్రీను జోడీ మరోసారి సందడి
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న నాలుగో చిత్రం Akhanda 2 : తాండవం’. ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా విడుదల కానుంది.
డబ్బింగ్ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం
బాలకృష్ణ తన డబ్బింగ్ పనులను పూర్తి చేశారని 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌లో ప్రకటించింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. “గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో (God of Masses Balayya) ఈ చిత్రం 4X బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది,” అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
టీజర్‌తో అంచనాలు ఆకాశం
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ శివుని వాహనం నంది, త్రిశూలంతో బాలయ్యను ఉగ్ర దైవిక రూపంలో చూపించి అభిమానులను ఆకర్షించింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి.
తారాగణం మరియు సాంకేతిక బృందం
సంయుక్త హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా ‘జనని’ పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జార్జియా, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది.
దసరా రిలీజ్‌తో అభిమానుల ఆనందం
సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం అఖండ ఫ్యాన్స్‌కు భారీ వినోదాన్ని అందించనుంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :