हिन्दी | Epaper

Akhanda 2 release date : ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది…

Sai Kiran
Akhanda 2 release date : ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది…

Akhanda 2 release date : బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 14 రీల్స్ ప్లస్‌ మరియు ఈరోస్ మధ్య ఆర్థిక వివాదాల కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు కేసు కారణంగా సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది.

అయితే తాజాగా అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో, మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ 12న ‘అఖండ 2’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఈ రోజు సాయంత్రం చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: Nivetha Pethuraj: ఎంగేజ్‌మెంట్ ఫొటోలు తొలగించిన నివేదా!

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతితో పేడ్ ప్రీమియర్స్ కూడా నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషంలో వాయిదా పడటంతో తీవ్రంగా (Akhanda 2 release date) నిరాశ చెందిన బాలయ్య అభిమానులకు ఇది భారీ ఊరట కలిగించే వార్తగా మారింది.

ఓవర్సీస్‌లో భారీ విడుదల లేకపోయినా, పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఫలితం పూర్తిగా మారే అవకాశముంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దేశీయ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్‌కు దోహదం చేస్తుంది.

‘అఖండ’లో ఇచ్చిన పవర్‌ఫుల్ అనుభూతిని బోయపాటి, బాలయ్య, థమన్ మరోసారి రిపీట్ చేస్తే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే చేస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు సినిమాకు కావాల్సింది ఒక్కటే – మంచి టాక్. అది వస్తే హద్దులే ఉండవు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘దండోరా’ ఫెయిల్యూర్‌కు కారణం ఇదే, శివాజీ వివరణ

‘దండోరా’ ఫెయిల్యూర్‌కు కారణం ఇదే, శివాజీ వివరణ

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

📢 For Advertisement Booking: 98481 12870