హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, విడులైన పది రోజుల్లోనే ఏకంగా రూ.110 కోట్లు వసూలు చేసింది. దీంతో నిర్మాతలు కేవలం థియేట్రికల్ వసూళ్ల ద్వారానే 450% లాభాలు పొందడం విశేషం. ఇది హోంబలే ఫిల్మ్స్ సంస్థకు మరో భారీ విజయాన్ని అందించింది.
‘కాంతార’ తర్వాత మరో అద్భుత విజయం
హోంబలే ఫిల్మ్స్ గతంలో నిర్మించిన ‘కాంతార’ (Kanthara)చిత్రం కూడా ఇలాగే తక్కువ బడ్జెట్‌తో విడుదలై, ఊహించని విజయాన్ని సాధించింది. ఆ చిత్రం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి రూ.450 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’ కూడా అదే బాటలో పయనిస్తూ, సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఇది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలను, కథా ఎంపికలో వారి దూరదృష్టిని మరోసారి నిరూపించింది.
యానిమేషన్ చిత్రాలకు పెరిగిన ఆదరణ
సాధారణంగా యానిమేషన్ చిత్రాలు పిల్లలను మాత్రమే ఆకట్టుకుంటాయని భావిస్తారు. అయితే, ‘మహావతార్ నరసింహ’ విజయం ఈ అపోహను తొలగించింది. మంచి కథాంశం, అద్భుతమైన యానిమేషన్ ఉంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ చిత్రం నిరూపించింది. భారతీయ పురాణ కథాంశాన్ని యానిమేషన్ రూపంలో చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని యానిమేషన్ చిత్రాలు నిర్మించడానికి ఇతర నిర్మాణ సంస్థలకు స్ఫూర్తినిస్తుంది.
Read Also : Meera Mithun: సినీ నటి మీరా మిథున్ ని అరెస్టు చేయండి: కోర్ట్