हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

శ్రీశైలం మల్లన్న సేవలో అక్కినేని కుటుంబం

Sudheer
శ్రీశైలం మల్లన్న సేవలో అక్కినేని కుటుంబం

శ్రీశైలానికి పర్యటనకు వచ్చిన అక్కినేని కుటుంబం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల దంపతులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. శ్రీశైలం ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున ఈ పూజలో పాల్గొన్నారు. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం చేసి, వారికి మంగళార్థం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. నాగార్జున కుటుంబ సభ్యులకు అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్బంగా నాగార్జున దేవాలయం నిర్వాహణ, పురాతన చరిత్ర గురించి అభినందనలు వ్యక్తం చేశారు.

తమ కుటుంబానికి ఈ పూజల ద్వారా ఎంతో ఆధ్యాత్మిక శాంతి లభించినట్లు నాగార్జున పేర్కొన్నారు. శ్రీశైలానికి వచ్చిన ప్రతిసారి మల్లికార్జున స్వామి దర్శనం ఎంతో విశేషమైన అనుభూతిని ఇస్తుందని, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ పర్యటనలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి శ్రద్ధాభక్తులు ఆలయ ఉద్యోగులను ఆకట్టుకున్నాయి. అక్కినేని కుటుంబం దర్శనానికి వచ్చిన భక్తులు వారితో ఆత్మీయంగా మాట్లాడి సందడి చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870