ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిశ్రమ స్పందన పొందినప్పటికీ..కలెక్షన్స్ మాత్రం అదరగొడుతుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ.. “పుష్ప 2 విజయానికి కారణమైన ప్రేక్షకులకు, చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ నాకు ఈ స్థాయిని అందించాడు. నా నటనలో ఉన్న ప్రత్యేకత అంతా అతని వల్లే,” అని వెల్లడించారు. అలాగే, చిత్రానికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరియు టికెట్ రేట్లు పెంచినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా బన్నీ, పవన్ కళ్యాణ్‌ను “కళ్యాణ్ బాబాయ్” అని పిలవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్‌కు బన్నీపై ఆగ్రహం పెరిగిన నేపథ్యంలో, ఆయన ఇప్పుడు పవన్ గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.